ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్ల ఉత్సవాలు - శ్రీ చౌడేశ్వరి దేవి తిరుణాల ఉత్సవాలు

కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.

sri chowdeshwaridevi tirunala utsavalu started at kurnool district
వైభవంగా మొదలైన శ్రీ చౌడేశ్వరి దేవి తిరుణాల ఉత్సవాలు

By

Published : Feb 7, 2020, 10:05 AM IST

వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్ల ఉత్సవాలు

కర్నూలు జిల్లా కోడుమూరులో కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గుమ్మటోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మేళతాళాల మధ్య హంద్రీ నది నుంచి తెచ్చిన జలంతో అమ్మవారికి జలాభిషేకం చేసి పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి...వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి:వైభవంగా లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details