ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మగువలు కుట్టిన... కుర్రకారు మెచ్చే జీన్స్

బాగా వెనుక బడిన ప్రాంతం అది. పెద్దగా చదువుల్లేవు.. ఆర్ధికంగానూ అంతంత మాత్రమే. అయితేనేం ఆత్మవిశ్వాసం ఎక్కువే. చీకట్లో చిరుదీపంలా దొరికిన ఆధారంగా ముందడుగు వేస్తున్నారు. కుర్రకారు మెచ్చే జీన్స్ కుట్టి ఔరా అనిపిస్తున్నారు కర్నూలు జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన మగువలు.

women's earns with stitching at aaluru
జీన్స్​ కుట్టి ఆర్ధిక స్వావలంబన పొందుతున్న మహిళలు

By

Published : Aug 24, 2021, 8:21 PM IST

జీన్స్​ కుట్టి ఆర్ధిక స్వావలంబన పొందుతున్న మహిళలు

కర్నూలు జిల్లా ఆలూరులోని మహిళలు.. ట్రెండ్‌కు తగ్గట్టు కుర్రకారు మెచ్చే జీన్సులు కుట్టి ఔరా అనిపిస్తున్నారు. జీన్స్ కుట్టడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సాధారణ గృహిణులు, పొదుపు మహిళలు.. మూడేళ్లుగా జీన్స్​ కుట్టి ఆర్ధిక స్వావలంబన పొందుతున్నారు. జిల్లాలో ఆలూరు పేరు వినగానే మొదట గుర్తొచ్చేది వలసలు. ఈ ప్రాంతంలోని ప్రజలు వర్షాల్లేక, ఉపాధి దొరక్క వలస బాట పట్టేవారు. ఈక్రమంలో గతంలో పనిచేసిన కలెక్టర్ విజయమోహన్ మెప్మా ద్వారా.. స్థానిక మహిళలకు 45 రోజులు కుట్టు శిక్షణ ఇప్పించారు. అనంతరం బళ్లారికి చెందిన జీన్స్ ప్యాంట్స్ పరిశ్రమల యజమానులతో సంప్రదించి... స్త్రీ శక్తి భవనంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా మూడేళ్లుగా జీన్స్ కుట్టి. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న మహిళలలు పలువురుతో ఔరా అనిపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details