కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కుర్ ఇటీవలే స్వచ్ఛత ప్రమాణాలు పాటించే గ్రామంగా ఎంపికైంది. అయితే అధికారుల నివేదిక పేపర్లకు పరిమితమై గ్రామంలో ఇసుమంతయినా అభివృద్ధి కనిపించడం లేదు. ఈ ప్రాంతంలోని కోడుమూరు - ఎమ్మిగనూరు ప్రధాన రహదారి ఇళ్ల మధ్యలో ఉండగా.. దారిలో నిత్యం మురుగు తాండవిస్తోంది. ఆలయాలు, ఇళ్ల ముందు చెత్తచెదారం పెరుకుపోయింది. అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోవటం లేదు.
అవార్డు సరే.. మరి స్వచ్ఛత ఏది? - కర్నూలు జిల్లా తాజా వార్తలు
స్వచ్ఛతలో జిల్లాలోనే తొలి స్థానం పొందింది ఆ గ్రామం. కానీ అభివృద్ధి మాత్రం కనుచూపు మేరలో కానరావటం లేదు. ఎక్కడికక్కడ ఆగిపోయిన మురుగునీరు.. వాటి చుట్టూ దోమలు, కీటకాలు విలయతాండవం చేస్తున్నాయి. ఇదీ స్వచ్ఛ గ్రామంగా అవార్డు పొందిన.. వర్కుర్ పరిస్థితి.
వర్కుర్ గ్రామం
స్వచ్ఛత అవార్డు ఎలా వచ్చిందో అధికారులకే తెలియాలని.. గ్రామంలో ఏ మూల చూసినా మురుగు తాండవం చేస్తుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మురుగు కాలువలు నిర్మించడం లేదని, ఇప్పటికే 10 సార్లకు పైగా కొలతలు తీసుకుని మిన్నకుండిపోయారని అంటున్నారు. గ్రామపంచాయతీ, సంబంధిత అభివృద్ధి అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.
ఇదీ చదవండీ..గుంటూరులో విజృంభిస్తున్న కరోనా.. జీజీహెచ్‌లో నిండిపోయిన 500 పడకలు