మహాశివరాత్రిని పురస్కరించుకుని కర్నూలులో ప్రసిద్ధ శైవక్షేత్రమైన మహానంది గర్భాలయ ఆవరణలో ఉన్న నందికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానందీశ్వరుడిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి సందర్భంగా శైవాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రమైన మహానందిలోని మహానందీశ్వరుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు