కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. లోకం సుభిక్షంగా ఉండాలంటూ 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారి ఆధ్వర్యంలో పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ఇందుకోసం దేశంలోని పవిత్ర నదుల నుంచి జలాలను... పుణ్య క్షేత్రాల నుంచి పవిత్ర మట్టిని సేకరించి 1001 పవిత్ర కలశాలలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
అహోబిలంలో సహస్ర కలశాభిషేకం... - అహోబిలంలో సహస్ర కలశాభిషేకం
లోకం సుభిక్షంగా ఉండాలని కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. దేశంలోని పవిత్ర నదుల నుంచి జలాలు, మట్టిని తీసుకొచ్చి పూజ చేశారు.
అహోబిలంలో సహస్ర కలశాభిషేకం