ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిలం నరసింహాలయంలో ఘనంగా సుదర్శన యాగం - అహోబిలంలో ప్రత్యేక పూజలు

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహుని ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని... తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

హోమం నిర్వహిస్తున్న అర్చకులు

By

Published : Oct 28, 2019, 7:15 PM IST

అహోబిల క్షేత్రంలో సుదర్శన హోమం

కర్నూలు జిల్లా అహోబిలంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా.. దిగువ అహోబిలంలో స్వామివారికి సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. కొండల్లో వెలసిన భార్గవ, పావన, వరాహ ఆలయాలకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details