కర్నూలు జిల్లాలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జయరాం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను చాలా దగ్గర నుంచి చూశారని వారికి ఎలాంటి సమస్యలున్నా ఎక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలను పరిష్కరించాలని నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తూ దానికి సంబంధించిన రసీదులను అందజేయాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులకు తెలిపారు.
"స్పందన"తో .. మీ సమస్యకు పరిష్కారం - problem sloving programme
ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన "స్పందన" కార్యక్రమానికి విపరీతమైన స్పందన వస్తోంది. తమ దరఖాస్తులను సమర్పించేందుకు పెద్దల నుంచి వృద్దుల వరకు అందరూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు
ధరఖాస్తు ఇస్తున్న ప్రజానికం