కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప పర్యటించారు. పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లను పరిశీలించారు. బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన... నియోజకవర్గంలో 31 కేసులు ఉన్నట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల తరహాలోనే ఇక్కడ కూడా కేసుల నియంత్రణకు కృషి చేస్తున్నామని... దయచేసి ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వస్తే మాస్కులు ధరించి, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఫకీరప్ప కోరారు.
కంటోన్మెంట్ జోన్లో ఎస్పీ పర్యటన
కంటైన్మెంట్ జోన్లలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప పర్యటించారు. నియోజకవర్గంలో 31 కేసులు నమోదైనట్లు తెలిపిన ఆయన కర్నూలు, నంద్యాల తరహాలోనే ఇక్కడ కూడా కేసుల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు.
కంటోన్మెంట్ జోన్లను పరిశీలించిన ఎస్పీ