జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాయలసీమను కరవు ప్రాంతంగా ప్రకటిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సౌభాగ్య రాయలసీమ పథకం కింద కేసీ కెనాలు ద్వారా రెండు పంటలకు నిరందీస్తామన్నారు. ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫేస్టోను ప్రజలకు వివరిస్తూ... అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడతామని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు అండగా ఉండి...సీమలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని కొణిదెల గ్రామాన్ని పవన్ సందర్శించారు. గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి