కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సుమారు వెయ్యి పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంది. రోజురోజుకూ బాధితుల పెరుగుదలతో, అదనపు ఆక్సిజన్ పడకలు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం..లిండే గ్రూప్ భారత్ సంస్థ నిర్వహణలో 2 లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా రోజూ 23 టన్నుల ఆక్సిజన్‌ను నిల్వ చేసుకుని రోగులకు అందిస్తున్నారు. ఇవేకాక పీఎమ్ కేర్స్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రూ.2 కోట్లతో పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను సిద్ధం చేశారు. వీటన్నింటికీ తోడు.. మరో ప్లాంట్ ఏర్పాటుకు సినీనటుడు సోనూసూద్ ముందుకొచ్చారు.
కర్నూలులో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పనున్న సోనూసూద్ - సోనూసూద్ తాజా వార్తలు
'చేసేకొద్దీ మీకు అలుపొస్తుందేమో... నాకు ఊపొస్తుంది..!' అన్నట్టుగా సాగిపోతోంది సోనూసూద్ నిస్వార్థ సేవా ప్రస్థానం. దేశాన్ని ప్రస్తుతం వేధిస్తున్న సమస్య.. ఆక్సిజన్ కొరత. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలనుకున్న సోనూ.. కర్నూలు నగరంలోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాడు.
కర్నూలులో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పనున్న సోనూసూద్
ప్లాంట్ ఏర్పాటు విషయమై.. ఇప్పటికే కర్నూలు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌తో సోనూ సూద్ మాట్లాడారు. రూ.2 కోట్ల ఖర్చుతో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్ గురించి ఈ వారంలో ఓ సాంకేతిక బృందం నగరంలో పర్యటించనుంది. జూన్ రెండో వారానికి ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. సోనూ దాతృత్వాన్ని అధికారులు అభినందిస్తున్నారు. నగరవాసులు సోనూసూద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఇప్పటికే తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: