Sons Killed Their Wives: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఈనెల 14వ తేదీన జరిగిన తోటికోడళ్ల హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు తోటికోడళ్ల భర్తలు పెద్ద గోవిందు, చిన్న గోవిందుతో పాటు మామ గోగన్న, నాటు మందు వైద్యురాలు పార్వతమ్మలు కారణమని కర్నూలు అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు.
కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, పిల్లలు పుట్టకపోవడంతో తనను కోడళ్లు చంపి ఆస్తి తీసుకుంటారన్న భయంతో మామ గోగన్న.. తన ఇద్దరు కొడుకులతో హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాటు మందు పెట్టారనే అనుమానంతో మామ గోగన్న జోహరపురం గ్రామానికి చెందిన నాటుమందు వైద్యురాలు మటం పార్వతమ్మ దగ్గరకు వెళ్లగా,.. ఆవిడ అవునని చెప్పింది.
దీంతో అనుమానం పెంచుకున్న మామ.. హత్యలు చేసినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. పొలంలో పనిచేస్తున్న సమయంలో తలపై కొట్టి చంపినట్లు పేర్కొన్నారు. పొలంలో దొరికిన ఓ చెప్పు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్టు అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఈ హత్యలకు నాటుమందు వైద్యురాలు కారణం కావడంతో ఆమెను కూడా అరెస్టు చేశారు.
తోటి కోడళ్ల హత్యపై పోలీసుల మీడియా సమావేశం "కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, పిల్లలు పుట్టకపోవడంతో ఇద్దర మహిళల చావులకు మామ, భర్తలు కారణం అయ్యారు. కోడళ్లు తమకు మందు పెట్టారేమోననే అనుమానంతో నాటు వైద్యురాలి దగ్గరకి వెళ్లారు. ఆవిడ మందు పెట్టారని చెప్పింది. దీంతో కోపం పెంచుకున్న మామా, భర్తలు పొలంలో పని చేస్తున్నప్పుడు చంపి, ఇంటికి వచ్చారు. పొలంలో దొరికిన ఓ చెప్పు ఆధారంగా నిందితులను పట్టుకున్నాం" - ప్రసాద్, అడిషనల్ ఎస్పీ
ఇవీ చదవండి: