ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తి కోసం తల్లిని చంపిన తనయుడు - murders in mittapalli news

ఆస్తి కోసం కన్న తల్లినే కడతేర్చాడో కుమారుడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం మిట్టపల్లిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Son  killed his  mother
మృతురాలి పాత చిత్రం

By

Published : Mar 11, 2021, 8:23 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం మిట్టపల్లిలో ఆస్తి కోసం తల్లిని కుమారుడే హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నారపరెడ్డి ప్రసాద్ రెడ్డి.. కన్నతల్లి పుల్లమ్మ( 65)ను కర్రతో కొట్టి చంపాడు. రెండు ఎకరాల ఆస్తిని కూతురుకు రాసి ఇచ్చిందనే కోపంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి వేరే గ్రామానికి వెళ్లిపోయాడు.

పుల్లమ్మ కనిపించట్లేదని చుట్టు పక్కన వారు ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె శవమై కనిపించింది. వెంటనే కుమారుడు ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేయగా ఏమీ ఎరగనట్టు ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు వివరాలు సేకరించడంతో అసలు విషయం బయటపడింది. మృతురాలి కూతురు లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ఆటో, కారు ఢీ- ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details