Kurnool Crime News: కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని బుదవారపేటకు చెందిన దీపకు కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ మురళితో 2020లో వివాహం జరిగింది. దంపతులు ఓర్వకల్లు మండలం నన్నూరులో నివాసముంటున్నారు. వారికి గత ఏడాది డిసెంబర్లో బాబు(హర్ష) జన్మించాడు. మద్యానికి బానిస అయిన మురళి.. భార్యపై అనుమానం పెట్టుకున్నాడు. ఆటో సైతం సరిగా నడపడం లేదు. భార్యతో తరుచూ గొడవ పడేవాడు.
తాజాగా భార్యతో గొడవ పడిన మురళి.. ఆమె గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. కొడుకు కుడా తనకు పుట్టలేదని.. తలపై తాళంతో బలంగా కొట్టగా హర్ష చనిపోయాడు. ఈ మేరకు సీఐ శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ గోడవలో దీపకు సైతం బలంగా గాయాలు కావడంతో చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మురళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.