ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడి దాడి - son in law attack on mother in law in allagadda latest news

తన భార్యను కాపురానికి పంపించడం లేదని అత్తపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

son in law attack on mother in law with knife at kurnool district
అత్త పెద్దక్కపై అల్లుడు హరి కత్తితో దాడి

By

Published : Aug 6, 2020, 11:49 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కాపురానికి పంపించనందుకు ఆగ్రహించిన అల్లుడు అత్తపై దాడికి దిగాడు. మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన పెద్దక్క తన కూతురిని అదే గ్రామానికి చెందిన హరి అనే వ్యక్తికిచ్చి వివాహం జరిపించింది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు కారణంగా పెద్దక్క కూతురు కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది.

గురువారం హరి అత్తింటికి వెళ్లి కూతురిని కాపురానికి రమ్మని కోరగా పెద్దక్క నిరాకరించింది. దీనిపై ఆగ్రహించిన అల్లుడు హరి అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బంధువులు ఆమెను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ఆళ్లగడ్డ గ్రామీణ ఎస్సై వరప్రసాద్​ కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details