ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం.. ఆస్తి విషయమై విచక్షణారహిత దాడి !

కన్నతండ్రిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడో కుమారుడు. ఆస్తి విషయమై తలెత్తిన వివాదంతో మృగంలా మారి పాశవికంగా దాడి చేశాడు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం
కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం

By

Published : Feb 19, 2022, 2:48 PM IST

కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు చెందిన చంద్రన్నకు ఇద్దరు భార్యలు. మెుదటి భార్య చనిపోవటంతో ఆయన వెంకటేశ్వరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. మెుదటి భార్యకు ఓ కుమారుడు, కూతురు ఉండగా.., రెండో భార్యకు ఇద్దరు కుమారులు సంతానం. చంద్రన్న అందరికీ వివాహం చేసి..ఆస్తిని సమానంగా పంచాడు.

కాగా.. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చాయని మెుదటి భార్య కుమారుడు మల్లేశ్​.. కొంత కాలంగా చంద్రన్నతో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్య గాయత్రితో కలిసి చంద్రన్నపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనపై రెండో భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details