somu veerraju on atmakur incident: ఆత్మకూరు ఘటన ఎస్‌డీపీఐ నిషేధిత సంస్థ పనే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఇవాళ గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు ఘటనలో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిని చంపాలనే ప్రయత్నం జరిగిందన్నారు. భాజపా నేత వాహనం, పోలీసులపై రాళ్లు రువ్వడం ఎస్‌డీపీఐ పనే అని చెప్పారు. హత్యాయత్నానికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని.. డీఎస్పీ రమ్మంటేనే శ్రీకాంత్ రెడ్డి వెళ్లారని స్పష్టం చేశారు.
పోలీసులే శ్రీకాంత్ రెడ్డిని రక్షించారన్న సోము వీర్రాజు .. అదే పోలీసులు శ్రీకాంత్‌రెడ్డిపై 307 సెక్షన్ కింద కేసు పెట్టారని ఆక్షేపించారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని వెల్లడించారు. శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన 307 కేసు తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి ప్రభుత్వం నిజాలు వెల్లడించాలన్నారు.
"ఆత్మకూరు ఘటనలో భాజపా నేత వాహనం, పోలీసులపై రాళ్లు రువ్వడం ఎస్‌డీపీఐ పనే. శ్రీకాంత్‌రెడ్డిని చంపాలనే ప్రయత్నం జరిగింది. హత్యాయత్నానికి సంబంధించి ఆధారాలున్నాయి. శ్రీకాంత్‌రెడ్డిపై 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం. శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన 307 కేసు తొలగించాలి" - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు