DRONE: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం - srisailam temple latest updates
18:39 December 23
DRONE: ఆలయ పుష్కరిణి వద్ద డ్రోన్ ప్రయోగానికి కొందరి యత్నం
DRONE: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పుష్కరిణి వద్ద డ్రోన్ ప్రయోగానికి కొందరు యత్నించారు. గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దేవస్థానం భద్రతా సిబ్బంది డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు.
విచారణ చేపట్టిన పోలీసులు..
డ్రోన్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గుజరాత్ భక్తులు డ్రోన్ ప్రయోగం చేసినట్లు గుర్తించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం డ్రోన్ తెచ్చినట్లు గుజరాత్ భక్తులు లిఖితపూర్వకంగా పోలీసులకు తెలిపారు.
ఇదీ చదవండి: