సైనికుడికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు - విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు శివ గంగాధర్ న్యూస్
చైనా సరిహద్దు వద్ద విధి నిర్వహణలో ఉండగా కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్లకి చెందిన సైనికుడు శివ గంగాధర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా అతని పార్థీవదేహానికి అధికార లాంఛనాలతో సైనికులు అంత్యక్రియలు నిర్వహించారు.
సైనికుడుకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్లకి చెందిన సైనికుడు శివ గంగాధర్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా అతని స్వగ్రామంలో గంగాధర్ భౌతికదేహానికి అధికార లాంఛనాలతో సైనికులు అంత్యక్రియలు నిర్వహించారు. చైనా సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. అతను మృతి చెందాడు. జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జిల్లా ఎస్పీ కె. ఫకీరప్పలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.