'ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు' అంటారు పెద్దలు. ప్రస్తుత కాలంలో పోటీ పడి మరీ పెళ్లికు ఖర్చు చేస్తుంటారు. చాలా మంది అవసరానికి మించి ఆడంబరాలకు పోతారు. దానికి భిన్నంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ వివాహం శీతల పానీయమే విందుగా మారింది. పట్టణంలోని ఫారీశమొల్ల ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ సనాభా, అజిమ్ భాయ్ దంపతుల చివరి కూతురు వివాహంలో పానియమే మాత్రమే బంధుమిత్రులకు విందుగా ఇచ్చారు.పెళ్లి ఖర్చులు తగ్గించాలని ...సాదాసీదాగా చేయాలనే మత పెద్దల మార్గదర్శనంతో ఈ పనికి పూనుకున్నట్లు బంధువులు తెలిపారు.
ఆదోనిలో సింపుల్గా పెళ్లి...విందు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! - adhoni latest news
రాష్ట్రంలో వివాహా వేడుకలు చాలా సాదాసీదాగా జరుగుతున్నాయి. దాని ముఖ్యకారణం మారిన వధూవరుల ఆలోచన విధానం. ఆడంబరాలకు పోకుండా...సింపుల్గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు యువతీ, యువకులు. తాజాగా ఇలాంటి వివాహామే కర్నూలుజిల్లా ఆదోనిలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో విందు ఏమి పెట్టారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఆదోనిలో వివాహా విందుగా శీతలపానీయం
Last Updated : Nov 9, 2020, 1:28 PM IST