ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో ఓ ఇంటి వద్ద హడలెత్తించిన పాములు! - News of snake bites in Adoni

మాములుగా పామును చూస్తేనే హడలెత్తిపోతాం... అలాంటిది సూమారు 60కి పైగా పాములు ఒకేసారి... ఒకే చోట కనిపిస్తే... ప్రాణాలు పోయేంత భయం అవుతుంది కదా. ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ఇంటి వద్ద జరిగింది. చిన్నచిన్న పాములు 60కి పైగా ఆ ఇంట్లో కనిపించేసరికి.. ఇంటివాళ్లే కాదు.. చుట్టుపక్కలవాళ్లు సైతం భయాందోళనలకు గురయ్యారు.

ఆదోనిలో ఓ ఇంటి వద్ద హడలెత్తించిన పాములు
ఆదోనిలో ఓ ఇంటి వద్ద హడలెత్తించిన పాములు

By

Published : Mar 24, 2021, 4:09 PM IST

ఆదోనిలో ఓ ఇంటి వద్ద హడలెత్తించిన పాములు

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ఇంటి వద్ద చిన్న చిన్న పాములు హడలెత్తించాయి. పట్టణంలోని ఎస్‌కేడి 6వ రోడ్డులో హసీనా అనే మహిళ ఇంటి వద్ద దాదాపు 60 పైగా పాము పిల్లలు బయటికి వచ్చాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని నెలలుగా డ్రైనేజీ కాలువలు తీయని కారణంగా... కాలువలు పాములకు నివాసాలుగా ఏర్పడ్డాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

పలుమార్లు సచివాలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పాము పిల్లలను చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరూ కలిసి చంపేశారు. రోడ్లపై వృద్దులు, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారన్నారు. అధికారులు పట్టించుకోకపోతే ప్రాణాపాయం తప్పదని ఆందోళన చెందారు. పురపాలక అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details