కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్పొస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న 10 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రికి చెందిన ఖాదర్ వలీ అనే నగల వ్యాపారి తెలంగాణలోని జోగులాంబ గద్యాల నుంచి చాగలమర్రికి వెండిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వెండి ఆభరణాల విలువ రూ. 6.50 లక్షలుగా వెల్లడించారు.
అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల వెండి పట్టివేత - కర్నూలులో వెండి పట్టివేత
ఆధారాలు లేకుండా కారులో అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల వెండిని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వెండి విలువ రూ. 6.50 లక్షలుగా అధికారులు వెల్లడించారు.
అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల వెండి పట్టివేత