ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై చెలరేగిన మంటలు.. కారణం? - కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదం న్యూస్

కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిలో మంటలు చెలరేగి విపరీతంగా పొగ కమ్ముకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలకు మంటలు అంటుకుని రెండు గంటల పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

Smoke on the National Highway in kurnool district

By

Published : Nov 12, 2019, 10:57 PM IST

జాతీయ రహదారిపై ప్లాస్టిక్ వ్యర్థాలతో చెలరేగిన మంటలు

కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిలో ప్రమాదం జరిగింది. డోన్ మండలం దొరపల్లి బ్రిడ్జ్​ సమీపంలో రోడ్డు పక్కనే ప్లాస్టిక్ వ్యర్థాల సంచులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వెళ్లారు. ప్లాస్టిక్ వ్యర్థాలు అంటుకుని దాదాపు రెండు గంటల పాటు మంటలు చెలరేగి.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా జాతీయ రహదారి పక్కన వ్యర్థాలను పడేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details