విజయవాడ నుంచి గుంతకల్లు వెళ్తున్న గూడ్సులోని 3 వాగన్లలో బొగ్గుకు నిప్పుంటుకుని పొగలు కమ్ముకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్లో పొగల్ని గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది సహాయంతో మంటల్ని అదుపుచేశారు. సకాలంలో స్పందించటంతో ప్రమాదం తప్పింది.
బొగ్గుల గూడ్స్ రైలులో ప్రమాదం..మంటలార్పిన సిబ్బంది - కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైల్లో పొగలు కమ్ముకున్నాయి. రైల్వే సిబ్బంది సకాలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సమాచారం అందించటంతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.
బొగ్గు రైల్లో కమ్ముకున్న పొగలు