Smart Meter Connections Without Informing Farmers:రైతుల ఆక్షేపణలు, ప్రతిపక్షాల ఆందోళనలను బేఖాతరు చేస్తూ వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లను బిగించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తోంది. కనీసం రైతులకు సమాచారం ఇవ్వకుండా మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఈ పనిచేస్తున్నారో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. మోటార్లకు మీటర్లు వద్దు మొర్రో అని రైతులు మొర పెట్టుకుంటున్నా వినడం లేదు. పొలం పని ముగించుకుని ఇంటికి వెళ్లి మర్నాడు తిరిగొచ్చే సరికి మీటర్లు దర్శనమివ్వడంతో అన్నదాతలు ఆశ్చర్యపోతున్నారు.
వేల కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ జగన్ సన్నిహితులకే- స్మార్ట్‌గా దోపిడీ
గత వారం రోజులుగా కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరవధికంగా విద్యుత్తు సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం రెండు విడతల్లో సరఫరా చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలను కర్షకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో మీటర్లు ఏర్పాటు చేయమంటూ ఏడాది కిందట చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం చడీచప్పుడు కాకుండా పనులు ప్రారంభించడం గమనార్హం. దీంతో వ్యవసాయానికి నిర్ణయించిన విద్యుత్తు కంటే అధికంగా వినియోగిస్తే మా పరిస్థితేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదనంగా విద్యుత్తు వాడితే బిల్లులు చెల్లించాల్సిందేనా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు - ప్రజలపై పడనున్న 20 వేల కోట్ల భారం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 లక్షల 7 వేల 247 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అందులో కర్నూలు జిల్లాలో లక్షా 4 వేల 612, నంద్యాల జిల్లాలో లక్షా 2 వేల 635 ఉన్నాయి. ఇందులో ఎస్సీ రైతులవి 918, ఎస్టీ రైతులకు చెందిన కనెక్షన్లు 264 ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని 314 ఫీడర్లు, నంద్యాల జిల్లాలోని 414 ఫీడర్లలో పనులు సాగుతున్నాయి. టెండరు దక్కించుకున్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థఉప గుత్తేదారులకు అప్పగించి పనులు చేయిస్తోంది. సగటున రోజుకు 40 నుంచి 50 మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మీటర్ల వివరాలను అధికారులు తెలుసుకుంటూ రోజువారీ నివేదికను ఎస్‌ఈ కార్యాలయానికి పంపుతున్నారు.
Electricity Charges Huge Increase in YSRCP Government: మాట తప్పి.. మడమ తిప్పేసిన జగన్.. విద్యుత్ ఛార్జీలను ఎడాపెడా పెంచి ప్రజలకే షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం
గడివేముల మండలంలో 4 వేల 638 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 100 మీటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులను నియంత్రించే కండెన్సర్‌ను కూడా పెట్టారు. ఈ 40 కండెన్సర్లలో అప్పుడే 3 కాలిపోయాయి. చడీచప్పుడు కాకుండా మీటర్లు బిగించడంతో ఎక్కడ ఏ కనెక్షన్ ఉందో తెలియక రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరవధికంగా విద్యుత్తు సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం రెండు విడతల్లో సరఫరా చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్ణయించిన విద్యుత్తు కంటే అధికంగా వినియోగిస్తే.. బిల్లులు తడిసిమోపుడవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ప్రభుత్వం మొండి వైఖరి- రైతులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా కనెక్షన్లు