ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలి' - Abdul Salam family suicide case latest news update

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ముస్లిం సంఘాలు డిమాండ్​ చేశాయి. కర్నూలులో అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి చేపట్టిన నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకున్న సందర్భంగా పలు ముస్లిం సంఘాలు దీక్షకు మద్దతు తెలిపాయి.

Abdul Salam Judicial Fighting Group
అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నిరాహారదీక్ష

By

Published : Nov 23, 2020, 4:43 PM IST


అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి చేపట్టిన నిరాహారదీక్ష ఆరో రోజుకు చేరుకుంది. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సమగ్ర దర్యాప్తు జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా నంద్యాలలో డిమాండ్​ చేశారు. సలాం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని సమితి నాయకులు డిమాండ్ చేశారు. నిరాహార దీక్షకు ముస్లిం ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details