సింహచలంలో భక్తుల దర్శనం కోసం ట్రయల్‌రన్ ప్రారంభమైంది. కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకు ఈ రోజు నుంచి దర్శనాలు ప్రారంభించారు.
సింహాద్రి అప్పన్న దర్శన భాగ్యం - సింహాచలం అప్పన్న స్వామి గుడి
ఉత్తరాంధ్రవాసుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సింహాచలేశుడి దర్శనాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ఆలయాలు మూతపడగా... తాజాగా కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఆలయాలు తెరుచుకున్నాయి.
సింహాచలం గుడి
మొదటగా... ఆలయ సిబ్బందికి, స్థానికులకు అనుమతిచ్చామనీ.... పదో తేదీ నుంచి భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:సింహాచలం, శ్రీశైలం ఈవోలుగా ఐఏఎస్‌లు?