కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని మూడు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు... దొంగతనానికి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి దాదాపు వంద తులాల వెండి, రూ.80 వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వేలిముద్రలు సేకరించారు.
సిరివెళ్లలో వరస చోరీలు... భయాందోళనలో స్థానికులు - సిరివెళ్ల నేటి వార్తలు
కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని వరస చోరీలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని మూడు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు వెండి, నగదు అపహరించారు.
సిరివెళ్లలో వరస చోరీలు
గత నెలలో సిరివెళ్ల మండల పరిధిలోని మూడు గ్రామాల్లోని ఆలయాల్లో దొంగలు చోరీ చేసి వెండి ఆభరణాలను అపహరించారు. వరసగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీచదవండి.