ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిద్ధేశ్వర అలుగు నిర్మించాలని రాయలసీమ సాగునీటి సమితి డిమాండ్​ - నంద్యాల పార్లమెంటు సభ్యుడు పొచా బ్రహ్మానంద రెడ్డి

కర్నూలు సిద్ధేశ్వర అలుగును వెంటనే నిర్మించాలని రాయలసీమ సాగునీటి సమితి డిమాండ్ చేసింది. సభ్యులు నంద్యాల ఎంపీకి వినతి పత్రం అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించారు.

rayalasima water problem solution
'సిద్ధేశ్వర అలుగు నిర్మిస్తేనే రాయలసీమకు నీళ్లు

By

Published : Nov 4, 2020, 8:20 PM IST

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర సమీపాన సిద్ధేశ్వర అలుగు నిర్మించాలని రాయలసీమ సాగు నీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. సభ్యులతో కలిసి ఆయన, నంద్యాల పార్లమెంటు సభ్యుడు పొచా బ్రహ్మానంద రెడ్డికి వినతి పత్రం అందజేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నీరు రాయలసీమకు రావాలంటే సిద్ధేశ్వర అలుగు ఏకైక మార్గమని వివరించారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని ఎంపీ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details