సిద్ధాపురం చెరువుకు గండి..
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు గండి పడింది. పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండి కారణంగా పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. గండిని త్వరగా పూడ్చాలని రైతులు కోరుతున్నారు.