లాక్ డౌన్ ఉల్లంఘించాడని చితకబాదిన ఎస్సై - cracking down on violation of lockdown
కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు ఎస్సై చితకబాదడంతో చేయి విరిగిందని ఓ ఆటో డ్రైవరు వాపోయారు.
లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు చితకబాదిన ఎస్సై
కర్నూలు జిల్లా మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన రాముడు పొలం పనులకు కూలీలను ఆటోలో తరలిస్తుండగా ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి అతన్ని చితకబాదారు. దీంతో తన చేయి విరిగిందని బాధితుడు తెలిపాడు. చికిత్స నిమిత్తం బాధితుడు నంద్యాల ఆస్పత్రిలో చేరాడు.
ఇది చదవండికర్నూలులో కోరలు చాస్తున్న కొవిడ్