ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి కుమారుడిపై దాడి కేసులో మలుపు.. దాడి చేసింది తండ్రే..? - కర్నూలు జిల్లా ఈరోజు తాజా వార్తలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పెళ్లి కుమారుడిపై కత్తితో దాడి ఘటన కేసు.. కీలక మలుపు తిరిగింది. మొదట ఆగంతకులు దాడి చేశారని భావించినా.. చివరకు ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారి కన్న తండ్రేనని తెలుసుకొని నిర్ఘాంతపోయారు.

attack on the bride
పెళ్లి కుమారుడిపై దాడి కేసులో కీలక మలుపు

By

Published : Jan 7, 2021, 1:50 PM IST

ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన హర్షవర్ధన్​కు ఈనెల 8న వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. 6న పెళ్లి కుమారిడిపై కొందరు దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. హర్షవర్ధన్ తండ్రి శ్రీనివాస చారితో కలిసి ఉదయం నడక వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో ఉన్న అతనిని బంధువులు ఆసుపత్రికి తరలించారు.

విచారణలో అసలు విషయం..

మొదట ఎవరో ఆగంతకులు దాడి చేసి ఉంటారని భావించినా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. హర్షవర్ధన్ తండ్రే కుమారుడి వివాహం ఇష్టం లేక, పెళ్లిని వాయిదా వేసేందుకు దాడి చేయించినట్లు తేలింది. సోదరి కూమార్తెతో కుమారుడి వివాహం చేయాలని శ్రీనివాసాచారి భావించాడు. అయితే హర్షవర్ధన్ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఇది ఇష్టం లేక.. వివాహాన్ని వాయిదా వేసే ఉద్దేశంతో కుమారుడి పై దాడి చేసినట్లు పోలీసులు తేల్చారు. మతి స్థిమితం సరిగా లేకే.. తండ్రి దాడి చేసి ఉంటారని కుమారుడు ఫిర్యాదు చేసినట్లు.. పోలీసులు చెప్పడం ఈ కేసులో కొసమెరుపు.

ఇవీ చూడండి:

రెండు రోజుల్లో వివాహం.. వరుడిపై హత్యాయత్నం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details