శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏడో రోజు బుధవారం శ్రీ బ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో సతీ సమేతుడైన మల్లన్నకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. సతీ సమేతుడైన మల్లన్న సాయంత్రం గజవాహనంపై పుర వీధుల్లో ఊరేగారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గురువారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజలు, తలపాగా కార్యక్రమం అనంతరం కల్యాణం నిర్వహించనున్నారు.
గజవాహనంపై సతీసమేతుడైన మల్లన్న ఊరేగింపు - Gaja Vahana Seva at Srisaila Devasthanam
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు సతీ సమేతుడైన మల్లన్న గజవాహనంపై పుర వీధుల్లో ఊరేగారు. గురువారం శివరాత్రి పర్వదినాన్న విశేష పూజలు నిర్వహించనున్నారు.
గజవాహనంపై సతీసమేతుడైన మల్లన్న ఊరేగింపు