ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాదరక్షల కౌంటర్లో భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం - కర్నూలు తాజా వార్తలు

మహానంది ఆలయంలో పాదరక్షలు భద్రపరుచినందుకు భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం చిత్రాన్ని ముద్రించారు. కొందరు భక్తులు గమనించి విషయాన్ని అధికారులకు తెలిపారు. వాటి స్థానంలో వేరే రశీదులను ఏర్పాటు చేశారు.

shivalingam on receipt given to devotees
పాదరక్షల కౌంటర్లో భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం

By

Published : Oct 13, 2020, 5:22 PM IST

కర్నూలు జిల్లా మహానంది ఆలయం బయట పాదరక్షలు భద్రపరుచినందుకు భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం చిత్రం ఉండటం వివాదాస్పమైంది. ఆలయానికి వచ్చే భక్తులు పాదరక్షలు కౌంటర్లో వదిలి వెళ్తారు. అందుకు ఓ రశీదు ఇస్తారు. దానిపై శివలింగం చిత్రాన్ని పొందుపరిచారు. కొందరు భక్తులు గమనించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటి స్థానంలో వేరే రశీదులను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details