ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల పురపాలక ఛైర్​పర్సన్​గా షేక్ మాబున్ని - నంద్యాల మున్సిపాలిటీ ఛైర్​పర్సన్​గా షేక్ మాబున్నిని ఎన్నుకున్న కౌన్సిలర్లు

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం ఛైర్​పర్సన్​గా షేక్ మాబున్ని ఎన్నికయ్యారు. ఛైర్​పర్సన్​గా మాబున్ని ఎన్నికవడం పట్ల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్​రెడ్డి సతీమణి నాగిణిరెడ్డి అన్నారు.

mabunni elected as nandyala municipal chairperson
నంద్యాల పురపాలక సంఘం ఛైర్​పర్సన్​గా షేక్ మాబున్ని

By

Published : Mar 18, 2021, 9:58 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం ఛైర్​పర్సన్​గా షేక్ మాబున్ని ప్రమాణ స్వీకారం చేశారు. . మైనార్టీ మహిళ షేక్ మాబున్ని నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర సతీమణి నాగిణిరెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి రానందుకు తనకు ఎలాంటి బాధ లేదని ఆమె అన్నారు. కౌన్సిలర్​గా నామినేషన్ దాఖలు వేసినప్పటి నుంచి అందరూ ఊహించారే తప్ప తామెప్పుడు చెప్పలేదని ఆమె అన్నారు.

ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిణిరెడ్డి సహా మరికొందరు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు వైకాపా కౌన్సిలర్లు ఎమ్మెల్యే శిల్పా కుటుంబ సాక్షిగా అని.. తెదేపా మహిళా కౌన్సిలరు మాత్రం.. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ భూమా నాగిరెడ్డి ఆత్మ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు.

ఇదీ చదవండి:కర్నూలు మేయర్​, డిప్యూటీ మేయర్ల ఎన్నిక​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details