ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశానవాటికలో ఇంటి స్థలాలు ఇచ్చారని లబ్దిదారుల నిరసన - kurnool district

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పరిధిలోని అవుకు మండలం చెర్లోపల్లిలో శ్మశాన వాటికలో ఇంటి స్థలాలు కేటాయించారని గ్రామానికి చెందిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

kurnool district
ఇంటి స్థలాలు స్మశానవాటికలో ఇస్తారా?..లబ్దిదారుల నిరసన

By

Published : Jul 5, 2020, 5:32 PM IST

కర్నూలు జిల్లా అవుకు మండలం చెర్లోపల్లిలో ఇంటి స్థలాలను శ్మశాన వాటికలో కేటాయించారని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శ్మశాన వాటికలో ఇళ్ల స్థలాలు వద్దని నిరసన వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మించుకునేందుకు మంచి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details