కర్నూలు జిల్లాలో మరో ఏడు పాజిటివ్ కేసులు - total corona positive cases news Kurnool district
కర్నూలు జిల్లాలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు మరో ఏడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో ఈరోజు మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 92కి చేరింది. 26 మంది కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించగా వారిలో 19 మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలుజిల్లాలో తొలి కరోనా పాజిటివ్వ్యక్తి డిశ్చార్జి అయ్యారు.కర్నూలుజిల్లా నొస్సంలో ఉంటున్నరాజస్థాన్ యువకుడికి చికిత్స చేసిన అనంతరం ఇంటికి పంపించేశారు.