కర్నూలులో ఈనెల 14న జరిగిన బ్యాంకు మేనేజర్ మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు. పద్నాలుగవ తేదీ సాయంత్రం సంతోష్‌నగర్ కాలనీలో… ఇంటిముందు రోడ్డుపై కారు అడ్డంగా ఉందని మహేశ్వర్ రెడ్డి హారన్ కొట్టగా.. వాగ్వాదం జరిగింది.
ఈ విషయంలో పగను పెంచుకున్న చంద్రకాత్.. మరో ఆరుగురు కలిసి అదే రోజు రాత్రి హత్యకు పాల్పడ్డాడు. వేట కొడవళ్లు, పిడి బాకులతో క్రూరంగా హతమార్చారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి మరణాయుదాలు, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.