ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలి' - రాయలసీమ హక్కుల కమిటీ

రాజధానిపై అంశంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అంటుంటే... మరికొందరు మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది.

andhra map
ఆంధ్రా మ్యాప్

By

Published : Dec 21, 2019, 11:27 PM IST

రాయలసీమ హక్కుల కమిటీ ప్రకటన

రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల కమిటీ అధ్యక్షుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమ ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చాలని ఆయన కోరారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా సీమను గుర్తించాలన్న ఆయన... ఈ ప్రాంతంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలంటే రాజధాని ఏర్పాటే పరిష్కారమన్నారు. రాజధాని వస్తేన సీమ... రత్నాల సీమగా అభివృద్ది చెందుతుందని చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details