కర్నూలు సమీపంలోని పెద్దటేకురు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి 120 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ప్లాస్టిక్ సంచితో తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి తెలంగాణ మద్యం స్వాధీనం - కర్నూలు జిల్లాలో మద్యం పట్టివేత
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటంతో కొందరు అక్రమార్కులు నూతన విధానానికి తెర లేపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి తెలంగాణ మద్యం పట్టివేత