ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.10 లక్షలు విలువ చేసే ఎర్రచందనం పట్టివేత - చిన్న వంగలిలోని రేకుల బ్రిడ్జి వద్ద

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. చిన్న వంగలి వద్ద రూ.పది లక్షలు విలువ చేసే దుంగలు కూలీలు మోసుకెళుతుండగా అధికారులు అడ్డుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పదిహేను రోజుల వ్యవధిలోనే రెండో సారి ఎర్రచందనం పట్టుపడటం గమనార్హం.

Seizure of red sandalwood
రూ.10 లక్షలు విలువ చేసే ఎర్రచందనం పట్టివేత

By

Published : Nov 12, 2020, 8:48 PM IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. పది లక్షలు ఉండవచ్చని అధికారి శ్రీరాములు తెలిపారు. నల్లమలలో దాడులు నిర్వహించామని, చిన్న వంగలిలోని రేకుల బ్రిడ్జి వద్ద దుంగలను మోసుకుని వెళ్తున్న కూలీలను గుర్తించామని తెలిపారు. సిబ్బందిని చూసి వాళ్లు దుంగలను కింద పడేసి పారిపోయారని వివరించారు. అనంతరం కూంబింగ్ నిర్వహించామన్నారు. పదిహేను రోజుల వ్యవధిలోనే ఆళ్లగడ్డ పరిధిలో రెండో సారి ఎర్రచందనం పట్టుపడటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details