కర్నూలు జిల్లా ఆదోని శివారు చెక్ పోస్టు వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలను చేస్తున్న ఖాకీలను చూసి కర్ణాటకకు చెందిన కారు వేగంగా దూసుకుపోయింది. పోలీసులు కారును వెంబడించారు. వారిని చూసిన కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఆ వాహనాన్ని సోదా చేసిన పోలీసులు అందులో 20పెట్టెల్లో అక్రమంగా తరలిస్తున్న 1920 మద్యం టెట్రా ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని ఆదోని డీఎస్పీ వినోదకుమార్ తెలిపారు. కారును, సరుకును ఇస్వీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం - కర్ణాటక అక్రమ మద్యాన్ని పట్టుకున్న ఇస్వీ పోలీసులు
కర్నూలు జిల్లా ఆదోని శివారు సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. విలువ సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం