కర్నూలు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆధ్వర్యంలో వరుస దాడులు చేశారు. జిల్లా వ్యాప్తంగా బుధువారం ఒక్కరోజులు 53 కేసులు నమోదు కాగా 75 మందిని అరెస్టు చేశారు. 21 వాహనాలతో పాటు 230 లీటర్ల నాటుసారా,500 కేజీల బెల్లం వివిధ బ్రాండ్లకు చెందిన 344 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందికొట్కురు నియెజకవర్గ పరిధిలో ఆటోలో సీటు కింద తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 బాటళ్లను పోలీసులు స్వాదీనం చేసుకొని ఆటో ను సీజ్ చేశారు.
ఒక్కరోజులో 53 కేసులు.. 75 మంది అరెస్ట్ - latest kurnool district news
మద్యం అక్రమ రవాణ పై కర్నూలు జిల్లాలో పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు. బుధువారం ఒక్కరోజులో 53 కేసులు నమోదు కాగా 75 మందిని అరెస్టు చేశారు.
ఒక్కరోజులో 53 కేసులు.. 75 మందిని అరెస్టు