కర్నూలు సరిహద్దు పంచలింగాల వద్ద ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తెలంగాణలోని అలంపూర్ నుంచి పత్తికొండలోని పగిడిరాయికి తరలిస్తున్న 144 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా వాహనం కింద భాగంలో మద్యం సీసాలను పెట్టినట్లు చెప్పారు. మద్యం తరలించటానికి ఉపయోగించిన వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
పంచలింగాల వద్ద తెలంగాణ మద్యం స్వాధీనం - SEB officials seized Telangana liquor news
కర్నూలు సరిహద్దులోని పంచలింగాల వద్ద ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, నిందితులు