కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా ఐదు లారీలను అడ్డుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఈబీ కర్నూలు అదనపు ఎస్పీ గౌతమ్ శాలిని ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సీఐలు రామకృష్ణారెడ్డి, సుదర్శన రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్ఈబీ అధికారుల తనిఖీలు.. 5 ఇసుక లారీలు సీజ్ - నంద్యాల ఇసుక లారీలు స్వాధీనం వార్తలు
నంద్యాల డివిజన్ పరిధిలో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఐదు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఎస్ఈబీ అధికారుల తనిఖీలు.. అయిదు ఇసుక లారీను స్వాధీనం