పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు...రూ.47లక్షల కరోనా కిట్లు స్వాధీనం - సెబ్ అధికారుల సోదాలు
17:52 September 22
పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు...రూ.47లక్షల కరోనా కిట్లు స్వాధీనం
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న కొవిడ్ పరీక్ష కిట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా రాయలసీమ జిల్లాలకు సరఫరా చేసేందుకు కారులో తరలిస్తున్నట్టు అధికారుల గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన కిశోర్ అనే వ్యక్తి ఈ కిట్లను తీసుకుని వెళుతుండగా సెబ్ అధికారులు పట్టుకున్నారు. కొవిడ్ కిట్లకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో ఔషధ నియంత్రణ అధికారులకు సమాచారం అందించారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కేసు నమెదు చేసుకుని కిట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కిట్ల విలువ 47 లక్షల రూపాయలు ఉంటాయని డ్రగ్స్ కంట్రోల్ అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు.
ఇదీ చదవండి : ACB RAIDS: రూ.60 వేలు లంచం తీసుకుంటూ.. అడ్డంగా దొరికారు