Teacher taken alcohol in school timings : కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డిలోని మండల పరిషత్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు.. గ్రామ శివారులోని పంట పొలంలో మద్యం సేవిస్తూ.. స్థానికులకు చిక్కాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అంటూ నిలదీయడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వీరప్రసాద్.. శుక్రవారం పాఠశాలకు వచ్చారు. ఉదయం వరకు పాఠశాలలో ఉండి మధ్యాహ్నం వెళ్లి గ్రామ శివారులోని పొలంలో కొందరితో కలిసి మద్యం సేవిస్తున్న దృశ్యాలు కనిపించాయి. పాఠశాల సమయంలో మద్యం తాగిన సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.