కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆదోని మండలం బసాపురంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి శనివారం కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఈ విషయంపై పాఠశాల సిబ్బందికి ఆయన నిన్నటి వరకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవాల్టి పరిస్థితి చూస్తే.. కరోనా నిబంధనలు పాటించకుండా ఉపాధ్యాయులు యథావిధిగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. తరగతి గదులను శానిటైజ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల మూసివేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.