ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ భూమిలో ప్రైవేటు దందా.. ! - ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తుల హస్తం వార్తలు

అది నిన్నటి దాకా ప్రభుత్వ భూమి. నేడు అక్రమార్కుల పరమైంది. వారి కన్ను పడ్డ మరుక్షణం నుంచే అక్కడ తవ్వకాలు మొదలయ్యాయి. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్కడి మట్టిని తరలిస్తున్నా అడిగేవారూ, అడ్డుచెప్పేవారు కరవయ్యారు. మొత్తం 58.95 ఎకరాల భూమిని.. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రియల్టర్‌ హస్తగతం చేసుకుని రోజూ పదుల సంఖ్యలో వాహనాల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా ఏ అధికారీ ఇటువైపు దృష్టి సారించకపోవడం విచిత్రం.

private business in govt lands
private business in govt lands

By

Published : May 9, 2021, 4:16 PM IST

కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలోని ఎర్రమట్టి కొండ, రాతికొండ స్థానికంగా ప్రసిద్ధి చెందాయి. అధికారికంగా ఎర్రమట్టికొండ ప్రాంతం సర్వే నంబరు 222కు చెందిన ప్రభుత్వ భూమి. అది ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. మొత్తం 58.95 ఎకరాల భూమిని కర్నూలు జిల్లాకు చెందిన ఓ రియల్టర్‌ హస్తగతం చేసుకుని రోజూ పదుల సంఖ్యలో వాహనాల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా ఏ అధికారీ ఇటువైపు దృష్టి సారించకపోవడం విచిత్రం. ఇదే భూమిలో కొంత భాగాన్ని స్థానికులకు విక్రయించగా, మరికొంత భూమిని ఓ రెవెన్యూ ఉద్యోగి ఆక్రమించుకొని ప్లాట్లు వేసేందుకు రాళ్లు పాతారు. ఎర్రమట్టి కొండ ఉన్న ప్రాంతాన్ని సొంతం చేసుకునేందుకు కొన్నేళ్లుగా కొందరు ప్రయత్నాలు చేస్తూ ఆ భూమిపై పెత్తనం చలాయిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో మట్టి కొల్లగొడుతూ అక్రమాలకు తెరలేపారు.

లే అవుట్లకు మట్టి విక్రయాలు

ప్రభుత్వ స్థలాన్ని తనదంటూ వ్యవహారం నడపుతున్న రియల్టర్‌ ఆధ్వరంలో రోజూ రెండు జేసీబీల ద్వారా కూలీలు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. దాన్ని ప్రైవేటు లేఅవుట్లకు విక్రయిస్తూ యథేచ్ఛగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కోడుమూరు, గూడూరు పట్టణాల్లోని లేఅవుట్లకు ఒక్కో ట్రాక్టరు లోడ్‌ రూ.1500 వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే కొండ చుట్టూ పెద్దపాటి గుంతలు ఏర్పడ్డాయి. అలా దాదాపు 25 శాతం మట్టిని తరలించినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు ముడుపులు ముట్టడంతోనే ఇలా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎట్టకేలకు పోలీసుల తనిఖీ

చనుగొండ్లలో ఎర్రమట్టి తరలింపు సమాచారం తెలుసుకున్న పోలీసులు శనివారం పీఎస్సై మమత నేతృత్వంలో తనిఖీ చేశారు. తరలింపునకు ఎవరి అనుమతి తీసుకున్నారని జేసీబీ, ట్రాక్టరు డ్రైవర్లను విచారించారు. యజమాని అనుమతి తీసుకున్నామని, అతనితో చరవాణిలో మాట్లాడించారు. పోలీసులు జేసీబీలను ఠాణాకు తీసుకురావాలని ఆదేశించారు.

విచారించి చర్యలు తీసుకుంటాం

చనుగొండ్ల గ్రామంలోని ఎర్రమట్టి కొండ సరే.నం 222లోని ప్రభుత్వ భూమి. దాన్ని ఎవరూ ఆక్రమించినా, అక్కడ అక్రమంగా మట్టి తవ్వినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. గతంలోనూ ఆ భూమిపై ఎవరూ పెత్తనం చేయకుండా స్థానికంగా దండోరా వేయించాం. ప్రస్తుతం మట్టి తరలింపు విషయంపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా విచారణ జరుపుతాం. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. - వెంకటలక్ష్మి, తహసీల్దారు, గూడూరు

ఇదీ చదవండి:

హైదరాబాద్​కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details