కర్నూలులో ఎస్సీలపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కూడలి వద్ద ఎస్సీ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ వద్ద గత నెల 10వ తేదీన కొట్టాలు అంటించి ఎస్సీలపై దాడి చేసిన అంజిస్వామి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కరోనా నేపథ్యంలో ధర్నా చేసేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు.
'దాడి చేసిన వారిని అరెస్ట్ చేయండి' - kurnool city latest news
ఎస్సీలపై దాడిని నిరసిస్తూ కర్నూలు శ్రీ కృష్ణ దేవరాయల కూడలి వద్ద ఎస్సీ సంఘ నాయకులు నిరసన చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కొట్టాలు అంటించి దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన తెలిపిన ఎస్సీ సంఘ నాయకులు