ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బలం చూపించి.. మద్దతు సాధించి - కర్నూలులో ఎన్నికలు

కర్నూలు జిల్లా మంత్రాలయం మేజర్‌ పంచాయతీలో పోటీ పడేందుకు.. వైకాపాలోని ఔత్సాహికులు ఇలా జిల్లా నేతల ముందు ఓటర్లతో బలప్రదర్శన చేశారు. ఈ పంచాయతీలో మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

kurnool polls
బలం చూపించి.. మద్దతు సాధించి

By

Published : Feb 8, 2021, 7:12 AM IST

అభిప్రాయం చెప్పేందుకు వచ్చిన మహిళలు

ముఖ్యమంత్రులపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు తమ మద్దతుదారులతో గవర్నర్‌ వద్ద బలప్రదర్శన చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. మూడో దశలో ఎన్నికలు జరగనున్న కర్నూలు జిల్లా మంత్రాలయం మేజర్‌ పంచాయతీలో పోటీ పడేందుకు.. వైకాపాలోని ఔత్సాహికులు ఇలా జిల్లా నేతల ముందు ఓటర్లతో బలప్రదర్శన చేశారు. మాజీ సర్పంచి భీమయ్య, కొత్త వ్యక్తి.. హోటల్‌ పరమేశ్‌లు ఇద్దరూ వైకాపా మద్దతు ఆశించారు. ఇరువురు అభ్యర్థులు తమ మద్దతుదారులను వెంటబెట్టుకొని ఆదివారం మంత్రాలయంలోని ఓ కల్యాణ మండపానికి వచ్చారు. ఎవరికెంత బలం ఎందో కులాలు, వర్గాల వారీగా జిల్లా నేతల ముందు ప్రదర్శించారు. చివరకు పార్టీ జిల్లా నాయకుడు సీతారామిరెడ్డి.. భీమయ్యను సర్పంచి అభ్యర్థిగా, పరమేశ్‌ను ఉప సర్పంచి అభ్యర్థిగా ప్రకటించారు.

పరమేశ్ తరఫున వచ్చిన గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details